యాప్నగరం

బీసీలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు

తెలంగాణలో ఉన్న వెనుకబడిన తరగతులు (బీసీలు), ముస్లింలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

Samayam Telugu 28 Oct 2016, 10:08 am
తెలంగాణలో ఉన్న వెనుకబడిన తరగతులు (బీసీలు), ముస్లింలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
Samayam Telugu we increase bc reservation quota in telangana says kcr
బీసీలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు


రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లశాతాన్న పెంచేందుకు తమిళనాడు తరహా చట్టాన్ని అమలు పరిచేందుకు త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతామని ఆయన వెల్లడించారు.

తమిళనాడులో బీసీకులాలకు 69శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు ద్వారా అక్కడి సాధారణ పరిధి (50శాతం)కి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజ్యాంగం రిజర్వేషన్ల అమలు విధానం ప్రకారం అన్ని కులాలకు కలిపి 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు. అయితే 9వ షెడ్యూలు ప్రత్యేక చట్టం ద్వారా పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు ఉంది.

బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి...ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కేసీఆర్ బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ చైర్మన్ గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరీ గౌరీ శంకర్, ఆంజనేయగౌడ్ లు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో 80శాతానికిపైగా బడుగు బలహీన వర్గాలవారున్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని కేసీఆర్ అన్నారు.

బీసీకులాల జనాభా ఎంత ఉందో తెలిస్తే వారి అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టవచ్చని ఈ విషయంలో బీసీ కమిషన్ దృష్టిసారించాలని కేసీఆర్ చెప్పారు.

రిజర్వేషన్ల పెంపు, అమలులో ముస్లిం, బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.