యాప్నగరం

అప్పుడు జై తెలంగాణ అంటేనే సస్పెన్షన్

ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేసేవారని, అప్పుడు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం శోచనీయమని

Samayam Telugu 17 Dec 2016, 11:11 am
ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేసేవారని, అప్పుడు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం శోచనీయమని మంత్రి హరీష్ రావు అన్నారు. తాము ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో తెలంగాణ గురించి ప్రస్తావించినప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి వంటివారు మిన్నకుండిపోయారని...కుర్చీలో నిలబడితే కూడా సభ నుంచి బయటికి పంపించారని...సభలో తెలంగాణ పదాన్ని నిషేదించారన్న సంగతి మరిచిపోకూడదని హరీష్ రావు గుర్తి చేశారు.
Samayam Telugu we were suspended when we pronounced jai telangana harish rao
అప్పుడు జై తెలంగాణ అంటేనే సస్పెన్షన్


ఆరోజు మాట్లాడని నాయకులు..ఈరోజు తమకు నీతులు చెప్పొద్దని హరీష్ హితవు పలికారు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున..సభను అడ్డుకునే నాయకులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని హరీష్ రావు స్పష్టం చేశారు.

శనివారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తొమ్మిది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.