యాప్నగరం

‘తెలంగాణలో మరో రాష్ట్ర ఉద్యమం తప్పదు’

తెలంగాణలో దక్షిణ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే

Samayam Telugu 14 May 2017, 9:51 am
తెలంగాణలో దక్షిణ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని..పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు.
Samayam Telugu we will fight another state movement in telangana says mla vamshichand reddy
‘తెలంగాణలో మరో రాష్ట్ర ఉద్యమం తప్పదు’


డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే పాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతుల మధ్య విభేదాలు సృష్టించినట్లువుతుందని ఆయన హైదరాబాద్ లోని గాంధీభవన్ లో అన్నారు.

కేసీఆర్ రాజకీయ కుట్రల వల్ల భవిష్యత్ లో జల యుద్ధాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ కు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాలమూరు జిల్లాకు పూర్తిస్థాయిలో నీరందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.