యాప్నగరం

మరదలి పెళ్లి ఆపిన అక్క మొగుడు..!

మరదలిపై కన్నేసిన అక్క మొగుడు.. ఆమెకి కాబోయే వరుడుకి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి ఆఖరి నిమిషంలో పెళ్లి నిలిపివేయించిన ఘటన తూర్పుగోదావరి

Samayam Telugu 9 Jul 2018, 7:46 am
మరదలిపై కన్నేసిన అక్క మొగుడు.. ఆమెకి కాబోయే వరుడుకి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి ఆఖరి నిమిషంలో పెళ్లి నిలిపివేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. తన భార్య ఉపాధి కోసం కువైట్‌కి వెళ్లడంతో.. మరదలిని పెళ్లి చేసుకోవాలని అతను ఆశించాడు. కానీ.. ఆమెకి ఇటీవల పెళ్లి నిశ్చయం కాగా.. శనివారం వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఎలాగైనా ఆ వివాహాన్ని ఆపించాలని ఆమె బావ ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు.
Samayam Telugu Wedding


వృత్తిరిత్యా ఫొటో, వీడియో గ్రాఫర్ అయిన అతను.. తన మరదలి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీలంగా వరుడు మొబైల్‌కి పంపాడు. దీంతో.. పెళ్లి ఆఖరి నిమిషంలో వరుడు తాను ఈ వివాహం చేసుకోనని బంధువులతో తెగేసి చెప్పాడు. కారణంగా అడగ్గా.. తన ఫోన్‌కి వచ్చిన వాటిని చూపాడు. దీంతో.. కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు ఆరా తీసి.. అది తమ పెద్ద అల్లుడు అరాచకమేనని తేల్చారు. అనంతరం వధువు తండ్రి అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.