యాప్నగరం

కర్నూలు సమరం.. అభ్యర్థులెవరు?

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

TNN 21 Dec 2017, 2:33 pm
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. డిసెంబర్ 19వ తేదీ నుంచినే నామినేషన్లు మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం.
Samayam Telugu who will contest in kurnool mlc poll
కర్నూలు సమరం.. అభ్యర్థులెవరు?


పార్టీల బలాబలాల ఆధారంగా జరిగే ఎన్నిక కాబట్టి.. ఈ సీటుకు రెండు నామినేషన్లే దాఖలు అయ్యే అవకాశం ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నామినేషన్, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరు ఎవరు? అనే అంశంపై కూడా ఇప్పటి వరకూ స్పష్టత లేదు.

అధికార పార్టీ కూడా ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి మాత్రం.. గౌరు వెంకటరెడ్డి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రితం సారి ఈ సీటుకు ఎన్నికలప్పుడు గౌరు వైసీపీ తరఫు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేసి గెలిచి, రాజీనామాతో ఉప ఎన్నికకు కారణమైన చక్రపాణి రెడ్డి మాత్రం ఈ సారి పోటీలో ఉండరని తెలుస్తోంది.

తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరినందుకు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి కూడా ఈయన ముందుకు రానట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.