యాప్నగరం

తెలుగు మహాసభలు.. వీరికి ఆహ్వానాలేవి?: కాంగ్రెస్

భాగ్యనగరంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ కవులకు ఆహ్వానం దక్కకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండి పడింది.

TNN 13 Dec 2017, 10:46 am
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యం ఇవ్వడానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఈ సభలను ఘనంగా నిర్వహించేలా తెలంగాణ సర్కారు కార్యచరణ రూపొందించింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. ప్రతిష్టాత్మక తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి తెలంగాణ కవులకు ఆహ్వానం అందకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
Samayam Telugu why telangana poets are ignored for world telugu conference congress
తెలుగు మహాసభలు.. వీరికి ఆహ్వానాలేవి?: కాంగ్రెస్


అందెశ్రీ, గోరేటి వెంకన్న, విమలక్క, తిరుమల రావు, జయ భీమ్ లాంటి వారిని తెలుగు మహాసభలకు ఆహ్వానించక పోవడాన్ని తప్పుబట్టింది. ఈ మహాసభలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని, కేసీఆర్ ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని విమర్శించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించిన వారికి ఆహ్వానం దక్కకపోవడం ఏంటని.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

తెలంగాణ సాహిత్య వికాసానికి కృషి చేసిన వారికి ఆహ్వానం పంపలేదు. కానీ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉంటున్న కొందరు కవులకు మాత్రం వెండి పళ్లెల్లో ఆహ్వానాలు పంపారంటూ శ్రవణ్ మండిపడ్డారు. తెలుగు మహాసభల పేరిట తన ప్రతిష్టను పెంచుకోవడానికి కేసీఆర్ రూ. 50 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 4 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారన్న ఆయన టీఆర్ఎస్ పాలనను విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.