యాప్నగరం

సిరిసిల్ల: గుట్టుగా మరో మహిళతో.. తాట తీసిన భార్య

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా (స్కూల్ అసిస్టెంట్) పనిచేస్తున్న ఓ వ్యక్తి 18 ఏళ్ల కిందట తన సహచర ఉపాధ్యాయురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిపోతుండటంతో భార్యకు అనుమానం వచ్చింది.

Samayam Telugu 23 Aug 2018, 11:38 pm
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా (స్కూల్ అసిస్టెంట్) పనిచేస్తున్న ఓ వ్యక్తి 18 ఏళ్ల కిందట తన సహచర ఉపాధ్యాయురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిపోతుండటంతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెట్టగా.. మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇంకేం.. ఆ ఇల్లాలు అతణ్ని కాలితో తన్ని, చెప్పులతో కొట్టి చితకబాదింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం (ఆగస్టు 23) ఉదయం ఈ ఘటన జరిగింది.
Samayam Telugu srinu


వెల్ముల శ్రీనివాస్‌ అనే వ్యక్తి వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పద్మ వేములవాడలోని ఎదుగట్ల పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 18 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

శ్రీనివాస్ కొంత కాలంగా తాను పనిచేసే గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూడా వివాహితే కావడం గమనార్హం. కొంతకాలంగా భర్త ఇంటికి సరిగా రాకపోవడంతో అనుమానించిన భార్య పద్మ అతడిపై నిఘా పెట్టారు. మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించారు. బంధువులతో కలిసి సిరిసిల్లలోని అనంతనగర్ వెళ్లారు. అక్కడ మరో మహిళతో ఏకాంతంగా ఉన్న శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కట్టుకున్న భర్త మరో మహిళతో కనిపించడంతో ఆ ఇల్లాలికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతణ్ని పట్టుకుని చెప్పుతో చితకబాదారు. కిందపడేసి కాలితో తన్నారు. పారిపోవడానికి ప్రయత్నించగా వెంటపడి చితకబాదారు. తన భర్తను వలలో వేసుకున్న మహిళను కూడా వదలలేదు. ఆమెపై పిడిగుద్దులు కురిపించారు.

ఉరిశిక్ష వేసినా ఆయనతోనే ఉంటా.. పిల్లలను కంటా!
సంధ్యారాణి మాత్రం శ్రీనివాస్‌తోనే ఉంటానని చెబుతోంది. శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు ఉరిశిక్ష వేసినా.. ఆయనతోనే ఉంటానని వాదిస్తోంది. పద్మ, ఆమె బంధువుల ముందే కుండబద్ధలు కొడుతోంది. శ్రీనివాస్‌తో కచ్చితంగా కాపురం పెడతానని, అతడితో పిల్లల్ని కూడా కంటానని చెబుతోంది.

తన భర్త కొన్నాళ్లుగా పెడదారి పట్టాడని పద్మ చెబుతున్నారు. సంధ్యారాణికి ఇంతకు ముందే పెళ్లయిందని.. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారని తెలిపారు. అయితే.. వారిని వదిలేసి తన భర్తను లొంగదీసుకుందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి శ్రీనివాస్‌ను, సంధ్యారాణిని అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.