యాప్నగరం

కిషన్‌ రెడ్డి కష్టపడే నేత.. ఆయన సీఎం కావాలి: కేసీఆర్

బీజేపీ నేత కిషన్‌ రెడ్డి కష్టపడే తత్వం గల నేత అని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

Samayam Telugu 14 Mar 2018, 3:40 pm
బీజేపీ నేత కిషన్‌ రెడ్డి కష్టపడే తత్వం గల నేత అని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అయితే.. ప్రభుత్వ విధానాలు, పరిపాలనపై అవగాహన పెంచుకుని మాట్లాడితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. బుధవారం (మార్చి 14) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చెప్పిన లెక్కలపై కేసీఆర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
Samayam Telugu wish to see kishan reddy as cm says kcr in assembly
కిషన్‌ రెడ్డి కష్టపడే నేత.. ఆయన సీఎం కావాలి: కేసీఆర్


‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర అప్పు రూ.72 వేల కోట్లు ఉంటే.. ఈ రోజుకు పాతవి, కొత్తవి అన్నీ కలిపి రూ. 1,42,000 కోట్లకు చేరాయి. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేద్దామంటే కుదరదు. ఆర్బీఐ వద్ద అన్ని లెక్కలూ ఉంటాయి. ప్రతి పైసాపై ఆర్‌బీఐ నిఘా ఉంటుంది’ అని కేసీఆర్ అన్నారు.

ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద కూడా ఉంటాయని కేసీఆర్ తెలిపారు. ‘23 జిల్లాలతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఖర్చు రూ. 1,29,683 కోట్లు. జానాభా ప్రకారం తెలంగాణకు రూ. 54 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ అలా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ క్యాపిటల్ ఖర్చు రూ. 1.25 కోట్లు. ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తోంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని కేసీఆర్ అన్నారు.

‘కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదు. ఒక మిత్రుడిగా చెబుతున్నా.. ఆయన అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. కిషన్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నా’ అని కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.