యాప్నగరం

జగన్‌ సీఎం కావాలి.. అందుకే దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై కత్తితో దాడి చేసి సంచలనం సృష్టించిన జానపల్లి శ్రీనివాస్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

Samayam Telugu 25 Oct 2018, 10:12 pm
న్నికల్లో సానుభూతి కోసమే జగన్‌పై కత్తితో దాడి చేశానని నిందితుడు జానపల్లి శ్రీనివాస రావు తెలిపాడు. వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. గత ఎన్నికల్లోనే జగన్ సీఎం కావాల్సి ఉందని.. జగన్ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందానని శ్రీనివాస్ పోలీసులతో చెప్పాడు.
Samayam Telugu attack


జగన్‌పై దాడి చేస్తే సానుభూతి పెరుగుతుందనే ఇలా చేశానని శ్రీనివాస రావు చెప్పాడు. తాను జగన్‌కు అభిమానినని తెలిపాడు. తమ కుటుంబసభ్యులందరూ వైఎస్ అభిమానులేనని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపొంది సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

నిందితుడి శ్రీనివాస రావు జేబు నుంచి 11 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ జగన్, సీఎం చంద్రబాబును ఉద్దేశించి అతడు సుదీర్ఘ లేఖ రాశాడు. రాష్ట్రంలోని వివిధ పరిస్థితులు, పేదల కష్టాల గురించి తన లేఖలో ప్రస్తావించిన శ్రీనివాస రావు చివరగా.. ‘ఈ ఘటనలో నా ప్రాణాలు పోతే నా అవయవాలను దానం చేయండి.. అమ్మా నాన్నా..’ అంటూ ముగించడం గమనార్హం.


నిందితుడు శ్రీనివాస్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీయే అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు నిందితుడు చెప్పిన మాటలు ఎలా నమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. కుట్ర పూరితంగానే జగన్‌పై హత్యాయత్నం చేశారని, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడుతున్నారు..

మరోవైపు.. జగన్‌పై దాడి ఘటనపై అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో ఏసీపీ నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి డీజీపీ ఆదేశాల మేరకు సిట్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.