యాప్నగరం

తెలంగాణ ప్రజల దీవెనలతో.. దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తా: కేసీఆర్

పది లక్షల కి.మీ. ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. తెలంగాణ ప్రజల దీవెన ఉంటే జాతీయ రాజకీయాలకు దశాదిశా చూపిస్తా.

TNN 4 Mar 2018, 6:28 pm
కాంగ్రెస్, బీజేపీయేత పార్టీలకు అతీతంగా మూడో కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం ఇటీవల స్వరం మార్చారు. శనివారం మీడియా మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రబలమైన కృషి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. తమ్ముడూ త్వరలోనే కలిసి మాట్లాడుదామని ఆమె చెప్పారని టీఆర్ఎస్ అధినేత తెలిపారు.
Samayam Telugu with telangana people blessings i will guide indian politics kcr
తెలంగాణ ప్రజల దీవెనలతో.. దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తా: కేసీఆర్


‘పది లక్షల కి.మీ. ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. తెలంగాణ ప్రజల దీవెన ఉంటే జాతీయ రాజకీయాలకు దశాదిశా చూపిస్తా. ఈ దేశ ప్రజానీకానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేస్తా’నని కేసీఆర్ తెలిపారు. లేదంటే క్లిష్టమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమస్యల పట్ల పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.

‘దేశంలో మార్పు రావాలి. అది తెలంగాణలోనే ప్రారంభమైంది. నూరు శాతం మనం విజయం సాధిస్తాం. మీ ఆశ్వీరాదంతో ముందుకెళ్తాను. త్వరలోనే అందరితో మాట్లాడుతా. ఆర్థిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో మాట్లాడి చక్కటి అజెండా రూపొందిస్తామ’ని కేసీఆర్ తెలిపారు.

ఇంకా అజెండా కూడా స్పష్టం చేయకుండానే తమతో కలిసి పని చేయడానికి దేశవ్యాప్తంగా చాలా మంది సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఆరేడుగురు ఎంపీలు కూడా మాతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా మాట్లాడారని తెలంగాణ సీఎం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.