యాప్నగరం

మరణించిన పెద్దమ్మ మనకు నేర్పే పాఠం..

కృష్ణా జిల్లా భావదేవరపల్లికి చెందిన అరజా ఝాన్సి (64) స్వగ్రామం నుంచి అవనిగడ్డ వైపు బైక్‌పై వస్తున్నారు. కొంత దూరం ప్రయాణించాక ఓ పెట్రోల్ బంకు సమీపంలో దురదృష్టవశాత్తు ఆమె చీర కొంగు బైక్ వెనక చక్రంలో చుట్టుకుపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

TNN 16 Oct 2017, 7:37 pm
స్త్రీలు.. చీరలు, చుడీదార్‌లకు ఎంత ప్రాముఖ్యమిస్తారో.. బైక్‌పై ప్రయాణించేటప్పుడు అంతే జాగ్రత్త తీసుకోవాలనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలక విషయం. బైక్ ముందుకుపోనిచ్చే ముందు వాహనదారులు ఈ అంశాన్ని గమనించుకోవడం మరీ ముఖ్యం. ఈ కనీస అంశం పట్ల నిర్లక్ష్యం చూపించడంతో ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చల్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా భావదేవరపల్లికి చెందిన అరజా ఝాన్సి (64) స్వగ్రామం నుంచి అవనిగడ్డ వైపు బైక్‌పై వెళుతున్నారు. కొంత దూరం ప్రయాణించాక ఓ పెట్రోల్ బంకు సమీపంలో దురదృష్టవశాత్తు ఆమె చీర కొంగు బైక్ వెనక చక్రంలో చుట్టుకుపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Samayam Telugu woman killed after saree stucks in bike wheel in andhra pradesh
మరణించిన పెద్దమ్మ మనకు నేర్పే పాఠం..


అప్పటి వరకూ కబుర్లు చెబుతూ.. ఒక్కసారిగా విగత జీవిగా మారిన ఝాన్సీని చూసి బైక్‌ నడుపుతున్న వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె మృతదేహం వద్ద పోగైన జనం.. జరిగిన ఘోరాన్ని తెలుసుకొని కంటతడి పెట్టారు. మృత్యువు ఏ రూపంలో.. ఎలా దూసుకొస్తుందో ఎవరం ఊహించలేం. కానీ, కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే.. ప్రాణాలకే ప్రమాదం అనడానికి ఈ ఘటనే తార్కాణం.

చీర, చుడీదార్‌ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలూ.. ఇకనైనా కాస్త అప్రమత్తంగా ఉండండి. దూసుకెళ్లే బైక్‌లపై వెనక సీట్లో కూర్చునే యువతులూ.. మీ వెనక నుంచి వచ్చే వాహనదారుల గోడు వినండి.. చున్నీలు గాల్లో ఎగరకుండా చూసుకోండి. మరణించిన పెద్దమ్మ మనకు నేర్పుతున్న పాఠం ఇదే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.