యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం: ప్రేమోన్మాదానికి యువతి బలి!

తన ప్రేమను కాదన్నందుకు ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Samayam Telugu 22 Dec 2017, 10:53 am
తన ప్రేమను కాదన్నందుకు ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని లాలాగూడలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్ అనే వ్యక్తి కిరోసిస్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడ్డ సంధ్యారాణిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 70 శాతం శరీరం కాలిపోవడంతో ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుక్రవారం ఉదయం 7 గంటలకు సంధ్యా రాణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Samayam Telugu woman set on fire in public view at secundreabad and she dies hospital
హైదరాబాద్‌లో దారుణం: ప్రేమోన్మాదానికి యువతి బలి!


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు నేరెడు సంధ్యారాణి తన తల్లి, సోదరులు, అక్కలతో కలిసి లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్‌లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది. దుకాణంలో పని పూర్తయ్యాక సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఆశాకిరణ్‌ చిన్నారుల వసతి గృహం వద్దకు రాగానే కార్తీక్‌ అనే యువకుడు సంధ్యారాణి వద్దకు వచ్చి గట్టిగా అరిచాడు. ఆమె స్పందించేలోపు తనతో తెచ్చుకున్న కిరోసిన్‌‌ను ఆమె శరీరంపై పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు తాళలేక సంధ్యారాణి కుప్పకూలిపోగా, స్థానికులు పాత దుస్తులను ఆమెపై కప్పి మంటలను ఆర్పారు. సమాచారం తెలుసుకున్న సంధ్య తల్లి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

సంధ్య ఇంటికి సమీపంలో ఉండే కార్తీక్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే కార్తీక్ కొన్ని నెలల కిందట సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. కుటుంబ పోషణ తనపై ఉండటంతో అతడి ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. సంధ్యా రాణి కాదన్నా కార్తీక్ మాత్రం పట్టువదల్లేదు. ఆమెను వెంబడిస్తూ, ఫోన్ చేస్తూ వేధించేవాడు. దీంతో విసిగిపోయిన సంధ్య గత కొన్ని రోజుల నుంచి కార్తీక్ నుంచి తప్పించుకుని తిరుగుతోంది. గురువారం ఉదయం కూడా ఆమెకు ఫోన్ చేసిన కార్తీక్ తనను ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరించాడు. నిప్పంటించే ముందు ఆమెతో గొడవపడినట్లు స్థానికులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.