యాప్నగరం

వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం నుంచి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ.. ఫోరం నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు.

TNN 27 Dec 2017, 8:05 pm
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ.. ఫోరం నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 18, 19 తేదీల్లో 48వ వరల్డ్ ఎకనమిక్‌ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వెయ్యి మంది వరకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పలువురు నేతలు, నిపుణులు, ఎన్జీవో ప్రతినిధులు, మీడియా ప్రముఖులు సదస్సులో పాల్గొని తమ ఆలోచనలు పంచుకోనున్నారు. ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనే అవకాశం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.