యాప్నగరం

ఇంత రచ్చ అవుతుందనుకోలేదు: చంద్రబాబు

నంది అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందనుకుంటే.. ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించి ఇచ్చేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం (నవంబర్ 20) చంద్రబాబు నేతృత్వంలో జరిగిన స్ట్రాటజీ కమిటీ భేటీలో ‘నంది’ అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చింది.

TNN 20 Nov 2017, 8:06 pm
నంది అవార్డుల వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందనుకుంటే.. ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించి ఇచ్చేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. సోమవారం (నవంబర్ 20) చంద్రబాబు నేతృత్వంలో జరిగిన స్ట్రాటజీ కమిటీ భేటీలో ‘నంది’ అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డులు అంశం ఇంత వివాదాస్పదం అవుతుందని ఊహించలేదని అన్నారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ప్రకటించామని సీఎం చెప్పారు.
Samayam Telugu would have announce by ivrs survey says chandrababu on nandi awards row
ఇంత రచ్చ అవుతుందనుకోలేదు: చంద్రబాబు


ఏపీలో ఆధార్‌ కార్డు, ఓటరు కార్డులేని వారే హైదరాబాద్‌లో కూర్చొని నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని మంత్రి లోకేశ్‌ మండిపడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అసెంబ్లీలో నంది అవార్డుల అంశంపై మాట్లాడుతూ.. ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే హైదరాబాద్‌లో కూర్చొని అవార్డులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.