యాప్నగరం

జగన్‌ గృహప్రవేశం వాయిదా.. కారణం ఇదే!

రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధినేత తన మకాంను అమరావతికి తరలించగా, ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్ సైతం పార్టీ కార్యాలయాన్ని రాజధానిలో ఏర్పాటు చేసుకున్నారు.

Samayam Telugu 13 Feb 2019, 8:07 am
వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన్‌ సోదరి షర్మిల దంపతులు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గృహప్రవేశాన్ని వాయిదా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకట విడుదల చేశారు. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే రోజు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విశాఖ వెళ్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతోపాటు జగన్ గృహప్రవేశంలోనూ పాల్గొంటారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా జగన్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Samayam Telugu jagan


సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో రూపుదిద్దుకుంటున్నాయి. విభజన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోగా, ఇటీవల జనసేన అధినేత పవన్ ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు. మరోవైపు బుధవారం ఒంగోలులో జరగాల్సిన ప్రకాశం జిల్లా సమర శంఖారావం సభ సైతం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో సభలను నిర్వహించే తేదీలపై ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన తర్వాతనే ఖరారుచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.