సోషల్ మీడియా వీడియో చాట్స్‌లో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. తాజాగా తెలంగాణలోని నేరేడ్మెట్లో ఓ యవకుడు.. ఓ అమ్మాయికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా బాబుసాయిపేట్కు చెందిన సాగర్.. గత కొద్దికాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తు్న్నాడు. అయితే, ఆమె సాగర్ ప్రేమను అంగీకరించలేదు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో మంగళవారం.. తనకు వీడియో కాల్ చేయాలని ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ పంపాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో.. ‘‘నేను ఆత్యహత్య చేసుకుంటున్నా. నా చావు నువ్వు చూడాలి’’ అని తెలిపాడు. ఆ మెసేజ్ చూసి కంగారుతో వీడియో కాల్ చేసింది. తనను బెదిరించడానికే అలా అంటున్నాడని ఆమె తొలుత భావించింది. అయితే, ఆమె చూస్తుండగానే సాగర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె ఒక్కసారే షాకయ్యింది.
దీనిపై పోలీసులకు సమాచారం అందగానే.. సాగర్ నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే అతడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
Read This Story in English
Read This Story in Ahmedabad Mirror