యాప్నగరం

రూ.15 వేల కోట్ల‌తో రైతుల కోసం

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 15 వేల కోట్ల రూపాయలతో స్థిరీక‌ర‌ణ‌నిధి ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Samayam Telugu 29 Aug 2018, 7:52 am
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 15 వేల కోట్ల రూపాయలతో స్థిరీక‌ర‌ణ‌నిధి ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 248వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల కూడలి నుండి ప్రారంభమైన పాదయాత్ర హరిపాలెం, తిమ్మరాజుపేట నుండి మునగపాక మండలానికి చేరింది. మార్గమధ్యంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని ఎంతో కష్టపడి సాగుచేస్తున్నప్పటికి గిట్టుబాబు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నట్టు రైతులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu 248వ రోజు ప్ర‌జా సంకల్ప యాత్ర‌లో జ‌గ‌న్


గతంలో ఎకరా పరిధిలో చెరుకు సాగుచేస్తే లక్ష రూపాయల ఆదాయం వచ్చేదని, ఇప్పడు 30 వేల పెట్టుబడితో వ్యవసాయం చేస్తే 20 వేలు కూడా రావడం లేదన్నారు. నల్లబెల్లానికి కూడా మార్కెట్‌లో గిరాకీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రైతు అనుమతి లేకుండా పొలాల్లో హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేయడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న రైతులతో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాబు ధర కల్పించడానికి రూ. 15వేల కోట్ల రూపాయలతో స్థిరనిధి ఏర్పాటు చేస్తామన్నారు.

అనంతరం హరిపాలెంలో చేతివృత్తిదారులు తమ సమస్యలను వివరించారు. 50 ఏళ్లకే పింఛన్ అందజేయాలని జగన్‌కు మొరపెట్టుకున్నారు. పాదయత్రలో జగన్ ప్రజలను పలకరిస్తూ యాత్ర ముందుకు సాగారు. వైసీపీ నేతలు కన్నబాబురాజు, ప్రగడ నాగేశ్వరరావు, వరుదు కళ్యాణి పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.