యాప్నగరం

సొంత జిల్లాకు సీఎం వరాలు.. 20వేల మందికి ఉద్యోగాలు

కడప స్టీల్ ప్లాంట్‌పై మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. మూడేళ్లలో ప్లాంట్ పూర్తి చేసి 20వేలమందికి ఉద్యోగాలిస్తామన్నారు.

Samayam Telugu 8 Jul 2019, 4:32 pm
కడప జిల్లాలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జమ్మలమడుగులో జరిగిన సభలో పాల్గొన్నారు.. సొంత జిల్లాపై వరాలు కురిపించారు. స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు జగన్ ప్రకటించారు. గత పాలకులు స్టీల్ ప్లాంట్‌పై ఎన్నో డ్రామాలాడారు.. కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉందన్నారు. డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానన్నారు. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తానని మాటిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
Samayam Telugu jagana


కడప జిల్లాలో ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేసి.. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామన్నారు. కేసీ కెనాల్‌ కింద కడప జిల్లాలో సాగునీరు అందక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు కడతామన్నారు. డిసెంబర్‌ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానన్నారు. పనుల్ని వేగవంతం చేసి.. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

దేవుడు కరుణిస్తే గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది 20 టీఎంసీలు నీరు నిల్వ చేసేలా చూస్తామన్నారు జగన్. అలాగే గండికోట నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని.. ప్రతి ఎకరాకు రూ.10లక్షల పరిహారం అందజేస్తామన్నారు. ఇలా జిల్లాలో ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేసి.. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇక బ్రహ్మంసాగర్‌కు నీళ్లందని పరిస్థితి ఉందని.. వెలుగోడు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్నా నీళ్లు లేవన్నారు జగన్. దీనిపైనా ఆలోచన చేస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.