యాప్నగరం

బస్సు యాజమాన్యాల నుంచే పరిహారం రాబట్టాలి: వైఎస్‌ జగన్‌

బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

TNN 28 Feb 2017, 8:05 pm
బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బస్సు యాజమాన్యాల నుంచే ఆ మొత్తాన్ని రాబట్టాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారనీ, లేకపోతే అన్ని కుటుంబాలకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Samayam Telugu ys jagan demands bus owners to pay compensation
బస్సు యాజమాన్యాల నుంచే పరిహారం రాబట్టాలి: వైఎస్‌ జగన్‌


కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. మృతదేహాలను నందిగామ ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ హాస్పిటల్ వద్దకు వెళ్లగా.. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకొని ఆయణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

‘డ్రైవర్‌ తాగి నడిపాడా? అని ప్రశ్నిస్తే.. డాక్టర్లు పోస్టుమార్టం చేయలేదని చెబుతున్నారు. అంటే పోస్టుమార్టం కూడా చేయకుండానే మృతదేహాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో డ్రైవర్‌ ఏమయ్యాడని అడిగితే.. అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అసలు వారికి లైసెన్స్‌ ఉందా? అన్నీ సక్రమంగా ఉంటే అతడు కనబడకుండా ఎందుకు పోయాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర చేస్తున్నట్లు తోస్తోంది. ఈ యాజమాన్యం టీడీపీ ఎంపీలది. ప్రభుత్వం వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.