యాప్నగరం

ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యంతర భృతిని 27 శాతం పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Samayam Telugu 6 Jul 2019, 4:44 pm
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ వైఎస్ఆర్సీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యంతర భృతిని 27 శాతం పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో ఖజానాపై రూ.815 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంచాలని.. సీఎం హోదాలో జగన్ నిర్వహించిన తొలి క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు. ఐఆర్ పెంపు ఈ నెల నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.
Samayam Telugu jagan on prajavedika


స్థానిక సంస్థలు, ప్రభుత్వ సాయంతో నడిచే సంస్థలకు కూడా ఐఆర్ పెంపు నిర్ణయం వర్తిస్తుంది. స్టేట్ జ్యూడీషియల్ సర్వీసులు, ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ ఆధారంగా జీతం పొందుతున్నవారు.. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అటామనస్ బాడీలు, గవర్నమెంట్ అండర్‌టేకింగ్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఐఆర్ పెంపు నిర్ణయం వర్తించదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.