యాప్నగరం

సీఎంగా జగన్ ప్రమాణం.. నలుగురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే నలుగురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. సీఎంవో నుంచి నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Samayam Telugu 30 May 2019, 7:36 pm
వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఏపీలో ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం కార్యాలయంలోని నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌ చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్‌, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్‌, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (మే 30) మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరినీ సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu cm jaganmohan


మరోవైపు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ధనుంజయ్ రెడ్డి.. సీఎంవో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించనున్నారు..
Also Read: సీఎం జగన్ వరాలు.. గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వ పథకాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.