యాప్నగరం

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: కిడారి మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి

ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదని.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జగన్.

Samayam Telugu 23 Sep 2018, 8:45 pm
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేని మావోయిస్టులు కాల్చిచంపడాన్ని తీవ్రంగా ఖండించాయన. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదని.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జగన్. కాగా కిడారి సర్వేశ్వరరావు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
Samayam Telugu జగన్

ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోలు కాల్చిచంపడం వెనుకు క్వారీ వివాదమే కారణం అని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీ పర్యావరణానికి నష్టం కలిగించేదిగా ఉండటంతో ఈ క్వారీని మూసివేయాలని వారు హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, బెదింపులకు దిగడం సరికాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై కాల్పులు జరిపి హత్య చేసినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.