యాప్నగరం

బాబొచ్చాకే సాగు పడిపోయింది: జగన్

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరవాతే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు.

TNN 2 May 2017, 5:45 pm
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరవాతే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో రెండు రోజుల పాటు చేపట్టిన రైతు దీక్షను ఆయన మంగళవారం విరమించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిర్చి ధర కేవలం రూ. 2 వేల నుంచి రూ. 4 వేలు మాత్రమే పలుకుతుందన్నారు. 2016-17 సంవత్సరంలో రైతులు 19 రకాల పంటలు పండిస్తే.. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించలేదని చెప్పారు.
Samayam Telugu ys jagan mohan reddy two days rythu deeksha completed
బాబొచ్చాకే సాగు పడిపోయింది: జగన్


గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరికి కనీసం మద్దతు ధర రాలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన తరవాత వ్యవసాయ రంగం ప్రాధాన్యం పెరిగిందని కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబుకు ధ్యాసలేదుకాని, కాంట్రాక్టర్లకు మాత్రం ధరలు పెంచడానికి అమితాసక్తి చూపిస్తారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 87 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటే, ప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ. 3 వేల కోట్లు రుణమాపీ చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.