యాప్నగరం

జగన్ పాదయాత్ర కృష్ణా నుంచి గోదావరికి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో కృష్ణా జిల్లాను దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది.

Samayam Telugu 14 May 2018, 11:33 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో కృష్ణా జిల్లాను దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. కృష్ణా జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా పూర్తి చేసుకొంటూ ఉండటం గమనార్హం. మొత్తం మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ లక్ష్యంతో జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అందులో రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని జగన్ పూర్తి చేస్తున్నారు నేటితో.
Samayam Telugu jagan_2000


కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా కృష్ణా జిల్లాలోకి వచ్చారాయన. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నారు.

పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ, వారికి రకరకాల హామీలను ఇస్తూ ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాల కార్యక్రమం గురించి వివరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ సాగుతున్నారు జగన్. పాదయాత్ర సందర్భంగా కోస్తాంధ్ర జిల్లాలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని దాటుతున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని మాదేపల్లి వద్ధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పైలాన్‌ను నిర్మించింది. నలభై అడుగుల ఎత్తున్న ఆ పైలాన్‌ను జగన్ నేడు ఆవిష్కరించనున్నారు. అలాగే ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సభను కూడా నిర్వహించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.