యాప్నగరం

చంద్రబాబు ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే - వైఎస్ జగన్

పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీదున్న మూడు సింహాలకి కానీ గుంటనక్కలకి కాదు" అని అన్నారు వైఎస్ జగన్..

Samayam Telugu 26 Jan 2017, 10:27 pm
"చంద్రబాబు నాయుడు వద్ద పనిచేసే పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీదున్న మూడు సింహాలకి కానీ గుంటనక్కలకి కాదు" అని అన్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైజాగ్‌లో ఏపీ యువత నిర్వహించతలపెట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలో పాల్గొని, వారికి మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన తనని వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచే హైదరాబాద్ వెనక్కి పంపించిన వైనంపై శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ys jagan press meet at hyderabad airport after returning back from vizat protest
చంద్రబాబు ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే - వైఎస్ జగన్


చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యుండి ఆయనే స్వయంగా ప్రత్యేకహోదాని నీరుగారుస్తున్నారు. విద్యార్థులు శాంతియుత ప్రదర్శనకు సిద్ధమైతే, పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు. తర్వాత వీటన్నింటిపై విచారణ జరిపి దోషులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులకి ఎవ్వరూ భయపడొద్దు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేది మహా అయితే ఇంకో రెండేళ్లే. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులపై పెట్టిన ప్రతీ కేసుని కొట్టేస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు. చంద్రబాబు వైఫల్యానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాల్సిందిగా ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకహోదా అనేది మన హక్కు అని పిలుపునిచ్చారు జగన్.

ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి జల్లికట్టుతో సంబంధం ఉందో లేదో తెలీదు కానీ తమిళనాడులో జల్లికట్టుతో ఏకమైన వారి కలిసికట్టుని, పోరాటపటిమని మనం స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లు సాధించుకున్నారు. ఉద్యమ స్పూర్తి అంటే అలా ఉండాలి అని అభిప్రాయపడిన జగన్.. ఏపీలో నిరుద్యోగులకి జాబు రావాలి అంటే బాబు పోవాలి అని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రులు పోతే కానీ మన రాష్ట్రం బాగుపడదు అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.