యాప్నగరం

విమానాశ్రయంలో జగన్‌ను అడ్డుకున్న పోలీసులు

విశాఖ గురువారం సాయంత్రం ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ జరగనుంది.

TNN 26 Jan 2017, 4:46 pm
విశాఖ గురువారం సాయంత్రం ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ జరగనుంది. ఆ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదారాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు. అయితే ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎవరూ అనుమతులు తీసుకోకపోవడంతో... పోలీసులు ఆర్కే బీచ్ ను దిగ్భంధం చేశారు. ఎవరిని ఆర్కే బీచ్ దరిదాపులకి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. వైజాగ్ విమానాశ్రయం చేరుకున్న జగన్ ను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బయటికి అనుమతించమని వారు తెలిపారు. దీంతో జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెనక్కి వెళ్లేంది లేదని విమానాశ్రయంలోనే కూర్చుండి పోయారు. అతనితో పాటూ వైసీపీ నేతలు కూడా బైఠాయించారు.
Samayam Telugu ys jagan protest on vizag airport runway
విమానాశ్రయంలో జగన్‌ను అడ్డుకున్న పోలీసులు


జగన్ రావడానికి ముందు పోలీసులు అతన్ని విమానాశ్రయంలోనే అడ్డుకోవాలని నిర్ణయించారు. ఎయిర్ పోర్టు చుట్టుపక్కల పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.