యాప్నగరం

ప్యారడైజ్ పేపర్స్ పై జగన్ సవాల్..!

‘ప్యారడైజ్ పేపర్స్’లో తన పేరుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం పట్ల స్పందించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

TNN 8 Nov 2017, 1:28 pm
ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న ‘ప్యారడైజ్ పేపర్స్’లో తన పేరుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం పట్ల స్పందించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పన్ను మినహాయింపు ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖుల జాబితాను ప్యారడైజ్ పేపర్స్ లో పేర్కొన్నారు. ఇందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉందని, జగన్ పై నమోదైన కేసుల ప్రస్తావన ఉన్నట్టుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ జగన్ పై విమర్శలు చేశారు. ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు.
Samayam Telugu ys jagan reacts on paradise papers
ప్యారడైజ్ పేపర్స్ పై జగన్ సవాల్..!


‘విదేశాల్లో నాకు డబ్బు ఉంది అని చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు, ఆయనకు నేను సవాల్ చేస్తున్నా.. నిరూపించమని. నాకు విదేశాల్లో డబ్బు ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించలేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకుంటారా? ఇదే నా సవాల్.. పదిహేను రోజుల పాటు సమయం ఇస్తున్నా.. చంద్రబాబు గారు ఈ సవాల్ ను స్వీకరిస్తారా?’ అని జగన్ అన్నారు.

తను ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. దాన్ని డైవర్ట్ చేయడానికి, తనపై బురద జల్లడం మామూలే అని, ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రను మొదలు పెట్టిన నేపథ్యంలో తప్పుడు కథనాలు రాసి తనపై బురద జల్లుతున్నారని జగన్ అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా వర్గాలు ఈ పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

కడప జిల్లాలో జగన్ పాదయాత్ర మూడో రోజు సాగుతోంది. ఉదయం 8.40కి జగన్ నేలతిమ్మాయి పల్లి నుంచి నడక మొదలుపెట్టారు. పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జనసామాన్యం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామిరెడ్డి పల్లి మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. ఈ రోజున జగన్ 16 కిలోమీటర్ల దూరాన్ని నడవనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉరుటూరు వరకూ నేడు జగన్ యాత్ర సాగుతుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.