యాప్నగరం

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

TNN 4 Nov 2017, 8:33 am
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తను చేపడుతున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర నేపథ్యంలో జగన్ రెడ్డి తిరుమల వెళ్లారు. పాదయాత్రకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేధ్య సమయంలో జగన్ మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
Samayam Telugu ys jagan reddy prays at tirumala
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్


దర్శన సమయంలో జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలంతా ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు జగన్ ను ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వైఎస్ జగన్ శారద పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపనందేంద్ర సరస్వతి ఆశీస్సులను తీసుకున్నారు. తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, తను చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నట్టుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఈ నెల ఆరో తేదీ నుంచి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు కానుంది. ఇడుపులపాయలో మొదలై శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకూ ఈ యాత్ర కొనసాగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.