యాప్నగరం

పవన్ పై జగన్ పరోక్ష విమర్శలు

పవన్ పేరును ప్రస్తావించకుండానే.. ‘సినీ యాక్టర్’ అని అంటూ జగన్ పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు.

TNN 11 Dec 2017, 2:43 pm
కొంత విరామం అనంతరం తన అభిమానులతో సమావేశాలు నిర్వహించి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతూ ఉండగా.. పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక సినీ యాక్టర్ ను పక్కన పెట్టుకుని వస్తున్నారు.. అని వ్యాఖ్యానించారు. పవన్ పేరును ప్రస్తావించకుండానే.. ‘సినీ యాక్టర్’ అని అంటూ జగన్ పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు.
Samayam Telugu ys jagan slams pawan kalyan indirectly
పవన్ పై జగన్ పరోక్ష విమర్శలు


‘తనను ప్రజలు మళ్లీ నమ్మరని చంద్రబాబుకు అర్థం అయిపోయింది. అందుకే ఈ సారి సినీ యాక్టర్ ను పక్కన పెట్టుకుంటాడు. ఆ యాక్టర్.. చంద్రబాబు అన్నీ చేస్తాడు.. తనదీ పూచీ అని అంటాడు. బాబుకు ఓట్లేయమంటాడు. జాగ్రత్తగా ఉండకపోతే వారి అబద్ధాలకు అంతే ఉండదు..’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కపట ప్రేమను చూపించే ఇలాంటి వారిని క్షమించకూడదని జగన్ అన్నారు.

అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పాదయాత్ర నేటితో 32వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసిన జగన్ ఇదే జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులోని వడ్డుపల్లి, మదిగుబ్బ గ్రామాల మీదుగా నేడు జగన్ పాదయాత్ర సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.