యాప్నగరం

రైతు సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం:వైఎస్ జగన్

రైతులకు అండగా ఉంటామని, రూ.500 కోట్లతో ‘రైతు స్థిరీకరణ నిధి’ ఏర్పాటు విషయాన్ని ప్రకటించే వరకూ ప్రభుత్వంతో పోరాడతామని జగన్ స్పష్టం చేశారు...

TNN 15 May 2017, 8:13 pm
రైతు సమస్యలు, ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్షం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేడని, గిట్టుబాటు ధర రాక రైతులందరూ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలిపే అంశానికి సంబంధించి రేపు (మే 16) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. రైతులకు అండగా ఉంటామని, రూ.500 కోట్లతో ‘రైతు స్థిరీకరణ నిధి’ ఏర్పాటు విషయాన్ని ప్రకటించే వరకూ ప్రభుత్వంతో పోరాడతామని జగన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో తన సమావేశాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Samayam Telugu ys jaganmohan reddy talks with media
రైతు సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం:వైఎస్ జగన్


మిర్చీ పంటకు సంబంధించి.. రైతులకు కల్పించే రేటుకు, షాపుల్లో రేటుకు చాలా వ్యత్యాసం ఉంటోందని.. సరైన విధానాలు లేకపోవడం వల్ల దళారులు రైతులను దోచుకు తింటున్నారని ఆయన విమర్శించారు. 92 లక్షల క్వింటాళ్ల మిర్చి పంట దిగుబడి అయితే ప్రభుత్వం కొన్నది ఎంత? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల మిర్చీ, మామిడి, టమాటో, ఉల్లీ, పసుపు.. ఇలా రైతులందరూ గిట్టుబాటు ధర రాక తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.