యాప్నగరం

అన్నొస్తున్నాడు కాదు ‘ప్రజా సంకల్ప యాత్ర’

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

TNN 26 Oct 2017, 3:06 pm
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర నవంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్రను 'అన్నొస్తున్నాడు' అనే పేరుతో చేపట్టాలని గతంలో అనుకున్నారు. అయితే, గురువారం జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాదయాత్ర పేరును 'ప్రజా సంకల్పం'గా మార్చారు. ప్రజల్లో ఉన్న బలమైన సంకల్పాన్ని ఈ పేరు సూచిస్తుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. పాదయాత్ర సందర్భంగా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు.
Samayam Telugu ys jaganmohan reddy will started paadayatra praja sankalpa yatra
అన్నొస్తున్నాడు కాదు ‘ప్రజా సంకల్ప యాత్ర’


హైదరాబాద్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాలు, జరగని ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనే అంశాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. మిగిలిన 58 నియోజకవర్గాల్లో పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.