యాప్నగరం

వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ..?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల

TNN 19 Sep 2017, 3:08 pm
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నదనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ రాష్ట్రమంతా పాదయాత్రతో తిరిగి, అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నదనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించనప్పటికీ... ఈ ప్రచారం ఆసక్తిదాయకంగా ఉంది.
Samayam Telugu ys sharmila to contest in next general elections
వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ..?


షర్మిల ఎంపీగా పోటీ చేస్తుందని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డే ఉంటారని, షర్మిల ఎంపీగా పోటీ చేస్తుందనే మాట వినిపిస్తోంది. షర్మిలకు తగిన నియోజకవర్గాన్ని అన్వేషించే పనిలో ఉన్నారట జగన్ మోహన్ రెడ్డి. విశాఖపట్టణం, ఒంగోలు, రాయలసీమలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

క్రితం సారి విశాఖలో జగన్ తల్లి విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ విశాఖను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒంగోలు నుంచి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సేవలను పార్టీకి వాడుకోవాలని భావిస్తున్నారట జగన్ మోహన్ రెడ్డి. అందుకే షర్మిల పోటీకి ఒంగోలు కూడా తగిన సీటు అవుతుందని అనుకుంటున్నారట. ఇలా సమాలోచనలు సాగుతున్నాయని, ఎక్కడ నుంచి అనేది చెప్పలేం కానీ, షర్మిల పోటీ మాత్రం ఖాయమే.. అనే మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.