యాప్నగరం

అప్పుడు టీడీపీ తరపున, ఇప్పుడు వైసీపీ నుంచి..!

ఆసక్తికరంగా మారిన ఉప ఎన్నిక

TNN 26 Jun 2017, 8:15 am
నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయగా, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డిని ప్రకటించింది. ఇటీవలే శిల్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశించి భంగపడిన శిల్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైకాపాలో తను నంద్యాల టికెట్ ను ఆశించడం లేదని శిల్ప ప్రకటించారు కూడా. అయితే అభ్యర్థిత్వం మాత్రం ఈయనకే దక్కింది.
Samayam Telugu ysrcp candidate declared for nandyal bypoll
అప్పుడు టీడీపీ తరపున, ఇప్పుడు వైసీపీ నుంచి..!


2014 సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నంద్యాల బరిలోకి దిగారు. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. అయితే అనంతరం భూమా నాగిరెడ్డి తెలుగుదేశంలోకి ఫిరాయించారు. ఆయన హఠాన్మరణంతో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. గతంలో వైకాపా తరపున నిలిచిన భూమా వర్గం ఇప్పుడు తెలుగుదేశం తరపున నిలుస్తుండటం, అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుండటం గమనార్హం.

ఇక ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే దక్కుతుందని ఆ పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి ఆశించారు. బహిరంగ ప్రకటన కూడా చేశారు. మరి శిల్ప అభ్యర్థిత్వం ఖరారవ్వడంతో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.