యాప్నగరం

వైఎస్ఆర్సీపీ కొత్త కార్యాలయం.. చూస్తే వావ్ అనాల్సిందే!

వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ముస్తాబవుతోంది. తాడేపల్లిలోని ఈ భవనం చూపరులను ఆకట్టుకుంటోంది. చూడగానే వావ్ అనిపించేలా ఈ బిల్డింగ్ ముస్తాబవుతోంది.

Samayam Telugu 12 Jul 2019, 7:18 pm
అమరావతి: తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలో నిర్మిస్తోన్న వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ఈ కార్యాలయాన్ని ప్రారరంభించనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి పార్టీ కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేశాక, కొత్త కార్యాలయం ఇంతవరకూ లేదు. తాడేపల్లిలో ఉన్న సీఎం నివాసంలోనే కొత్త కేంద్ర కార్యాలయం ఉంటుందని అంతా భావించారు. కానీ దాన్ని క్యాంప్ ఆఫీస్‌గా వినియోగిస్తున్నారు. అందుకే పార్టీ కోసం ప్రత్యేకంగా ఆఫీసును ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.
Samayam Telugu ysrcp central office


అధినేత ఆదేశాలతో అప్పటికే పార్టీ ఆఫీస్ భవనం కోసం నాయకులు వెతుకులాట ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన భవనం నిర్మాణంలో ఉండటంతో.. దాన్ని పార్టీ ఆఫీసుగా వాడుకుంటామని ప్రతిపాదించడం, ఆ నేత అంగీకరించడం.. ఇలా చకచకా జరిగిపోయాయి. పార్టీ కేంద్ర కార్యాలయం కావడంతో.. దానికి అవసరమైన హంగులు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ అద్దాలతో, పచ్చదనంతో కూడిన ఈ భవనం చూడగానే వావ్ అనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.