యాప్నగరం

చంద్రబాబుపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్

నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సభలు అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీల మధ్య మాటల యుద్ధాలకి...

TNN 10 Aug 2017, 11:08 pm
నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సభలు అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీల మధ్య మాటల యుద్ధాలకి వేదికలవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న దూకుడు వైఖరి ప్రస్తుతం చర్చనియాంశమవుతోంది. మొన్నటికిమొన్న నంద్యాల బహిరంగ సభలో కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్.. 'ఇచ్చిన హామీలని నిలబెట్టుకోనందుకు సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేయాలి' అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.
Samayam Telugu ysrcp chief ys jagan comments on ap cm chandrababu naidu
చంద్రబాబుపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్


వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమైన తెలుగు తమ్ముళ్లు జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేదు అనే ఆవేదనతోనే తాను అలా వ్యాఖ్యానించాను తప్ప తనకి ఇతర దురుద్దేశం లేదని ఈసీకి వివరణ ఇచ్చుకున్న జగన్.. ఆ తర్వాత మరో రెండు రోజులకే చంద్రబాబుపై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.

నంద్యాల నియోజకవర్గం పరిధిలోని దీబగుంట్లలో ఇవాళ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... ''చంద్రబాబుని ఉరితీసినా తప్పులేదు'' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. మొన్న నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేయాలి అనే కామెంట్స్ రేపిన వేడి ఇంకా పూర్తిగా చల్లారకముందే మళ్లీ ఇవాళ జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అతడి ఆంతర్యం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై జగన్ చేస్తోన్న విమర్శల దాడి, ప్రచారం తీరుతెన్నులు, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రస్తావిస్తున్న అంశాలు, ఇస్తోన్న హామీలు సర్వత్రా చర్చనియాంశమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.