యాప్నగరం

ప్రమాణం చేసిన రోజే కీలక ప్రకటనలు.. వడివడిగా జగన్ అడుగులు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజున కీలకమైన ప్రకటనలు చేసేందుకు సమాయత్తమయ్యారు.

Samayam Telugu 28 May 2019, 5:26 pm
పీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్ర నయా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజున కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు వైఎస్ జగన్ సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లాంతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మాజీ సీఎస్ అజయ్ కల్లాంను వైఎస్ జగన్.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించుకునే అవకాశం ఉంది.
Samayam Telugu jagan
వైఎస్ జగన్


నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడంతో పాటు.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలో ఆర్థికాంశాల్లో క్రమశిక్షణ విషయమై వైఎస్ జగన్ ప్రకటనలు చేయానున్నట్లు సమాచారం. సోమవారం (మే 27) జగన్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన అజయ్ కల్లాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు వివిధ శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన కొత్త నిర్ణయాలపై చర్చించినట్టు సమాచారం.

మరోవైపు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖల వారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని వైఎస్ జగన్‌కు అందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉంది? ఎంతమేరకు పనులు పూర్తయ్యాయనే అంశాలను వైఎస్ జగన్‌కు సీఎస్ వివరించినట్టు సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా జగన్‌కు సీఎస్ వివరాలు అందజేశారు..

మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్ష నిర్వహించడానికి జగన్ సమాయత్తమవుతున్నారు. జూన్ 1 నుంచి 5 వరకు శాఖల వారీగా జగన్ సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో నిర్ణయాలు అమలు చేసే దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో జగన్ సమావేశం కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.