యాప్నగరం

వాకౌట్ చేస్తామంటే మీ ఇష్టం: స్పీకర్ కోడెల

ప్రతీ ఏడాది బీసీ సంక్షేమానికి రూ.10,000 కోట్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో..

Samayam Telugu 7 Mar 2017, 11:27 am
ప్రతీ ఏడాది బీసీ సంక్షేమానికి రూ.10,000 కోట్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో రూ.8,000 కోట్లు కూడా ఇవ్వలేదని ప్రతిపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలకి జరుగుతున్న అన్యాయంపై చర్చ చేపట్టాల్సిన అవసరం వుంది అని జగన్ పట్టుపట్టారు. 2014-15 ఏడాదిలో బీసీలకి కేవలం రూ.2,200 కోట్లు మాత్రమే కేటాయించిన వైనాన్ని సభాధ్యక్షుడి దృష్టికి తీసుకువచ్చారు జగన్.
Samayam Telugu ysrcp demands explaination about economic aid to bc welfare
వాకౌట్ చేస్తామంటే మీ ఇష్టం: స్పీకర్ కోడెల


అయితే, ఈ క్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంని చుట్టిముట్టి తమ నేతకి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాత్రం ఇప్పటికే అయిపోయిన ప్రశ్నకి మళ్లీ సమాధానానికి పట్టుబడితే ఎలా అని ప్రతిపక్ష సభ్యులకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ సభ్యులు వినకుండా చర్చకు పట్టుపట్టడంతో వాకౌట్ చేస్తామంటే మీ ఇష్టం అని అసహనం వ్యక్తంచేశారు స్పీకర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.