యాప్నగరం

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక..ఇక లాంచనమే!

చాలా రసవత్తరం అవుతుంది అనుకున్న కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఉప ఎన్నిక చివరకు

TNN 26 Dec 2017, 10:40 am
చాలా రసవత్తరం అవుతుంది అనుకున్న కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఉప ఎన్నిక చివరకు పెద్దగా హడావుడి లేకుండా ముగుస్తోంది. శిల్ప చక్రపాణి రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరడంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక నిన్న మధ్యాహ్నం వరకూ ఆసక్తినే రేకెత్తించింది. నామినేషన్ల గడువు దగ్గరపడుతుండటంతో ఎవరెవరు పోటీ చేస్తారు? ఈ సారి క్యాంపు రాజకీయాలు ఎలా జరగబోతున్నాయి? ఎవరు గెలుస్తారు? అనే అంశాలపై చర్చ జరిగింది.
Samayam Telugu ysrcp droped from kurnool mlc election
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక..ఇక లాంచనమే!


2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ సీటుకు మూడోసారి ఎన్నిక జరుగుతోంది. మొదటి సారి ఉప ఎన్నిక వచ్చింది.. ఈ జిల్లా స్థానిక సంస్థల బలంలో వైకాపాకే మొగ్గు ఉంది. అయితే నాటి బై పోల్ లో తెలుగుదేశం ఈ సీటును సొంతం చేసుకుంది. అనంతరం పదవీ కాలం ముగియడంతో ఎన్నిక వచ్చింది. అప్పుడు టీడీపీ, వైసీపీలు గట్టిగానే పోరాడాయి. చివరకు తెలుగుదేశం పార్టీ 60 ఓట్ల మెజారిటీతో ఈ సీటును సొంతం చేసుకుంది.

ఈ పరంపరలో మళ్లీ వచ్చిన బై పోల్ ఆసక్తినే రేపింది. అయితే.. ఈ సారి మాత్రం వైసీపీ బరిలోకే దిగడంలేదు. వాస్తవబలం ఆ పార్టీకే ఉన్నా.. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుందని వైసీపీ తప్పుకుంది. తను విసిరేసిన సీటు కోసం తెలుగుదేశం నేతలు పోటీ పడుతున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లకు నేడే చివరి గడువు కూడా. మరో నామినేషన్ ఏదీ దాఖలు అయ్యే అవకాశాలు లేవు కాబట్టి.. వేరే హడావుడి లేకుండా కర్నూలు ఎమ్మెల్సీ సీటు బై పోల్ లాంచనంగా ముగుస్తున్నట్టే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.