యాప్నగరం

మంత్రులే దళారులు.. దోచుకుంటున్నారు: బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో రైతుకి గిట్టుబాటు ధర దక్కకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

TNN 3 May 2017, 1:11 pm
ఆంధ్రప్రదేశ్‌లో రైతుకి గిట్టుబాటు ధర దక్కకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతమున్న రైతుల హీనమైన, దీనమైన పరిస్థితి ఏనాడు చూడలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత వ్యవసాయరంగంలో ఇలాంటి పరిస్థితులు దాపరించలేదు మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు.
Samayam Telugu ysrcp leader botsa satyanarayana fires on tdp government
మంత్రులే దళారులు.. దోచుకుంటున్నారు: బొత్స


సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు నాయుడు చెపుతుంటారని, ఇప్పుడు అదే సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని మంత్రులే దళారులుగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన సహాయాన్ని ఈ దళారులుగా మారిన మంత్రులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మిర్చి పంట రైతుల చేతికి వచ్చిందని, దీన్ని దోచుకు తిండానికి వ్యాపారులు, దళారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ప్రభుత్వం మేల్కొని, మార్కెట్‌లో కలుగజేసుకుని ధర స్థిరీకరణకు ప్రయత్నించాలని గత మూడు నెలలుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము గొంతెత్తి అరుస్తాన్నామని, కానీ ప్రభుత్వం చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. తమతో పాటు రైతు సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమపై ఎన్ని అపనిందలు వేసినా, తమను ఎంత విమర్శించినా ఫర్వాలేదు కానీ రైతును మాత్రం ఆదుకోమని చంద్రబాబు నాయుడుకి బొత్స విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.