యాప్నగరం

‘జగన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’

పాదయాత్రలో అరుదైన మైలురాయి చేరుకున్న వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కత్తిదాడి తర్వాత తమ ప్రాంతానికి వస్తున్నాడంటూ భారీ ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Samayam Telugu 18 Nov 2018, 4:12 pm
ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు నాలుగున్నరేళ్ల చంద్రబాబు నాయుడు పాలనను ప్రశ్నిస్తూ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం 300వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో అరుదైన మైలురాయి చేరుకున్న వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
Samayam Telugu YS Jagan


నేటి ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్‌, బచి జంక్షన్‌ మీదుగా సీతాపురం క్రాస్‌ వరకు కొనసాగింది. అక్కడ జగన్ భోజన విరామం తీసుకున్నారు.

జగనన్న సంకల్పానికి నేడు 300 రోజులు పూర్తయిందంటూ తమ అభిమాన నేత కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. నేటి మధ్యాహ్నం కూరుపాం నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర అడుగుపెట్టబోతుంది. కత్తిదాడి తర్వాత జగన్‌ను చూసేందుకు వైసీపీ మద్దతుదారులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటుండటం గమనార్హం.

11 జిల్లాలో పాదయాత్ర పూర్తి..
2017, నవంబర్‌ 6వ తేదీన ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఇప్పటివరకు 11 జిల్లాలో పూర్తయింది. జగన్ ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఒక కురుపాం నియోజకవర్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయ్యాక చివరిగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ జగన్‌ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.