యాప్నగరం

ప్రధాని మోదీతో విజయ్ సాయిరెడ్డి భేటి

ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్సాఆర్‌సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటీ అయ్యారు. వీరిద్దరూ సుమారు అరగంటపాటు చర్చలు జరిపినట్లు సమాచారం.

TNN 30 Dec 2017, 12:13 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం 11:20 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానిని కలిసినట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రధానిని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఎంపీ తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపానని విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Samayam Telugu ysrcp mp vijay sai reddy meets prime minister narendra modi
ప్రధాని మోదీతో విజయ్ సాయిరెడ్డి భేటి


మర్యాద పూర్వకంగానే ప్రధానిని కలిశానని విజయ్ సాయి రెడ్డి చెబుతున్నారు. వీరి మధ్య రాష్ట్ర సమస్యలు, రాజకీయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జగన్ పాదయాత్ర గురించి ఆయన ప్రధానికి వివరించారని తెలుస్తోంది. ప్రధానిని కలిసిన అనంతరం విజయ్ సాయి రెడ్డి శనివారం జగన్‌ను కలిశారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జగన్‌తోపాటు పాదయాత్ర చేస్తూ మోదీతో భేటీ విశేషాలను వివరించారు.

ఇటీవల ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తే.. టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టం అవుతోంది. అదే సమయంలో బీజేపీతో మైత్రికి ప్రతిపక్ష వైఎస్సాఆర్‌సీపీ సుముఖంగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రధానిని కలిశారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పటికీ.. కేంద్ర మంత్రులతో మాత్రమే భేటీ అవుతున్నారు. మోదీని మాత్రం ఆయన కలవడం లేదు. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-జగన్ పార్టీ దగ్గరవుతాయా అనే అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.