యాప్నగరం

పోర్ట్ ఎవరైనా అప్పగిస్తారా.. ఇంగితం ఉండాలి చంద్రబాబూ: విజయసాయి

ఒక పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారు.. ఓటుకు నోటులో పారిపోయి.. హరికృష్ణ శవం పక్కనే లాలూచీ రాజకీయాలు చేసి.. భంగపడింది ఎవరు చంద్రబాబూ. ప్రజల్లో కొత్త అపోహలు తీసుకొచ్చే ప్రయత్నంచేయొద్దు.

Samayam Telugu 30 Jul 2019, 12:17 pm
తెలుగు రాష్ట్రాల్లో బందరు పోర్ట్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బందరు పోర్ట్‌ను తెలంగాణకు అప్పగిస్తారంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది. తెర వెనుక పోర్ట్‌ను తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి లోకేష్‌లు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు.
Samayam Telugu babu


బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ణానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కాదు అన్నారు విజయసాయిరెడ్డి. ‘ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిందీ తమరే. హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా చంద్రబాబు గారూ.. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండి’అంటూ మండిపడ్డారు.
ఇక లోకేష్‌ను టార్గెట్ చేశారు విజయసాయి. ‘విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు ఏమిటయ్యా లోకేశ్? మీ నాయన నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 2014లో 3,800 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్నినాలుగేళ్లలో 8 వేల కోట్లు దాటించారు. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది మీ తండ్రే కదా?’అంటూ ప్రశ్నించారు.
‘మీ రాక్షస పాలనలో ఉద్యోగులుకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు గారూ? అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా? అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది’అంటూ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.