యాప్నగరం

వైసీపీ దీక్ష: మేకపాటి ఆసుపత్రికి తరలింపు

ప్రత్యేకహోదా డిమాండ్ తో నిరాహార దీక్షలో ఉన్న వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సహచర

Samayam Telugu 7 Apr 2018, 3:58 pm
ప్రత్యేకహోదా డిమాండ్ తో నిరాహార దీక్షలో ఉన్న వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సహచర వైకాపా నేతలతో పాటు ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు నివేదికను ఇవ్వడంతో పోలీసులు మేకపాటిని బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. ఆయనను అంబులెన్స్ లోకి ఎక్కించి, ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu mekapati


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామా పత్రాలను ఇచ్చి నిన్నటి నుంచి నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రే మేకపాటి రాజమోహన్ రెడ్డి కడుపునొప్పితో బాధపడినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైద్యులు ఎంపీల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. మిగతా వాళ్ల పరిస్థితి నిలకడగా ఉందని, రాజమోహన్ రెడ్డి పరిస్థితి బాగోలేదని వారు పేర్కొన్నారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అక్కడ నుంచి తరలించారు. మిగతా వైసీపీ నేతల నిరాహార దీక్ష మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక వైసీపీ ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించారు సీపీఎం నేత సీతారాం ఏచూరి. కాసేపు దీక్షలో కూర్చుని ఆయన సంఘీభావం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ నేతలు ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.