యాప్నగరం

విద్యుత్‌దీప కాంతుల్లో మెరిసిపోనున్న బుద్ధవనం... రేపు 2566 బుద్ధ జయంతి వేడుకలు

విద్యుత్‌దీప కాంతుల్లో బుద్ధవనం మెరిసిపోనుంది. చారిత్రక కట్టడమైన 2466 బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఐఏఎస్ రాజశేఖర్ ఉండ్రు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన ప్రపంచం కోసం బౌద్ధం అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఈ సమాజానికి బౌద్ధ సంస్కృతి, దాని దాని ఔచిత్యం గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అవసరమని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 15 May 2022, 2:24 pm

ప్రధానాంశాలు:

  • నాగార్జున సాగర్‌లో 274 ఎకరాల్లో బుద్ధవనం
  • వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఐఏఎస్ రాజశేఖర్ ఉండ్రు
  • సమకాలీన ప్రపంచం కోసం బౌద్ధం అనే అంశంపై ప్రసంగం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బుద్ధవనం
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్‌లో అభివృద్ధి చేసిన ప్రతిష్టాత్మకమైన బుద్ధవనం ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో దగదగలాడనుంది. మే 16న బుద్ధ జయంతి సందర్భంగా బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లో వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో బుద్ధవనం కాంతులు జిమ్మనుంది. ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ పార్క్‌ని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 274 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు.
బుద్ధపూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రముఖ వ్యక్తులు పాల్గోనున్నారు. హర్యాణా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు మహా స్థూపంలోని సమావేశ మందిరంలో సోమవారం రాత్రి 7.00 గంటలకు "సమకాలీన ప్రపంచం కోసం బౌద్ధం" అనే అంశంపై ప్రసంగిస్తారని మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివనాగిరెడ్డి, ప్రొఫెసర్ సంతోష్ రౌత్ ప్రసంగించనున్నారు. EFL విశ్వవిద్యాలయం సెషన్‌కు అధ్యక్షత వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, పరిశోధనా పండితులు, బౌద్ధ సంస్థలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


బుద్ధుని 2566 జయంతిని పురస్కరించుకుని బుద్ధవనంలో చెట్లు, మొక్కలతో ఆకర్షణీయంగా తయారు చేశామని, లక్ష్మయ్య తెలిపారు. బౌద్ధ దేశాల్లో బుద్ధుని విగ్రహాలు, స్థూపాలు, చైత్య, విహారాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ అన్నారు. ఈ సందర్భంగా బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి బోధనలను వినిపించడమే కాకుండా.. పురాతన కాలం నాటి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. నేటి సమాజానికి బౌద్ధ సంస్కృతి, దాని దాని ఔచిత్యం గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అవసరమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.