యాప్నగరం

అద్భుతమైన ఫీచర్లతో ఎల్‌జీ నుంచి జీ6 మొబైల్

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ జీ6 మోడల్ మొబైల్‌ను లాంచ్ చేసింది.

TNN 26 Feb 2017, 6:20 pm
బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ జీ6 మోడల్ మొబైల్‌ను లాంచ్ చేసింది. 5.7 అంగుళాల తాకే తెర ఉన్న ఈ ఫోన్‌‌లో అద్భుత ఫీచర్లను ఏర్పాటు చేశారు. తెలుపు, నలుపు, ప్లాటినం వేరియంట్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఓవర్ హీట్ కాకుండా ఉండేందుకు హీట్ పైప్స్‌ను ఈ ఫోన్లో ఉపయోగించడం గమనార్హం. ఇది డాల్బి విజన్ హెచ్‌డీ రిజల్యూషన్ 10ను సపోర్ట్ చేసే తొలి మొబైల్ కావడం విశేషం. అధిక రిజల్యూషన్ ఉండటంతో ఇమేజ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. జీ6 మొబైల్ అంచులను మెటల్‌తో రూపొందించారు.
Samayam Telugu lg g6 launched at mobile world congress 2017
అద్భుతమైన ఫీచర్లతో ఎల్‌జీ నుంచి జీ6 మొబైల్


ఎల్‌జీ జీ6 మొబైల్ స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. విభిన్న తరహాల్లో ఫొటోలను తీసుకోవడం కోసం వెనుక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ ధరను మాత్రం ఎల్‌జీ ప్రకటించలేదు. ఇది వాటర్ ఫ్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్ మొబైల్ అని ఎల్‌జీ ప్రకటించింది. ఇది కేవలం ఫికల్స్‌కు సంబంధించిన ఫోనే కాదు.. అత్యుత్తమ ఇమేజ్ క్వాలిటీతో ఉండే మొబైల్ అని ఎల్‌జీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఫీచర్లు..
స్క్రీన్ సైజ్: 5.7 అంగుళాల తాకే తెర
రిజల్యూషన్: 2880x1440 ఫిక్సల్స్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 821
ర్యామ్: 4 జీబీ
మెమొరీ: 32 జీబీ స్టోరేజ్
రియర్ కెమెరా: డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ విత్ 13 మెగాఫిక్సల్ సెన్సార్స్
ఫ్రంట్ కెమెరా: సెల్ఫీల కోసం 5 మెగాఫిక్సల్ (100 డిగ్రీ వైడ్ యాంగిల్‌తో) ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ సామర్థ్యం: 3300 ఎంఏహెచ్

LG’s G6 has a wide-angle dual camera for the perfect Instagram shot pic.twitter.com/ivOAec9yrA — The Verge (@verge) February 26, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.