యాప్నగరం

ఈమెకు 63 ఏళ్లంటే నమ్ముతారా?

అరవైలో ఇరవైలా కనిపించాలని ఉందా? అయితే, ఆ సీక్రెట్ ఏమిటో ఆ బామ్మగారినే అడిగేద్దాం. సారీ, బామ్మ అంటే ఆమెకు కోపం వస్తుంది. ఎందుకంటే..

TNN 29 Jun 2017, 3:37 pm
రవైలో ఇరవైలా కనిపించాలని ఉందా? అయితే, ఆ సీక్రెట్ ఏమిటో ఆ బామ్మగారినే అడిగేద్దాం. సారీ, బామ్మ అంటే ఆమెకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె తన కూతుర్ల కంటే యంగ్‌గా కనిపిస్తోంది మరి. లురే హసు అనే 41 ఏళ్ల మహిళ 20 ఏళ్ల యువతిలా కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకోడానికి సోషల్ మీడియాలో చాలామంది ఆమె వ్యక్తిగత వివరాలు కోసం ‘తవ్వకాలు’ (లోతైన పరిశీలన) జరిపారు.
Samayam Telugu 63 yo taiwanese woman looked like a teen
ఈమెకు 63 ఏళ్లంటే నమ్ముతారా?


ఈ సందర్భంగా ఆమెకు ‘ముగ్గురు’ చెల్లెల్లు కూడా యంగ్‌గానే కనిపిస్తున్నారని తెలుసుకున్నారు. అయితే, మరికాస్త లోతైన పరిశీలన తర్వాత.. ఆమెకు ఉన్నది ఇద్దరు చెల్లెల్లు మాత్రమేనని ఇంకోకరు.. తన 63 ఏళ్ల తల్లి అని తెలిసి అంతా ఖంగుతిన్నారు. ఇంకేముంది.. 41 ఏళ్ల లూరేని పక్కన పెట్టేసి.. నెజిన్లంతా 63 ఏళ్ల బామ్మ వెంట పడ్డారు.

ఇంతకీ వాళ్లు ఇంత యంగ్‌గా కనిపించడం వెనుక సీక్రెట్ ఏమిటని ఆరా తీస్తే... రోజూ లీటర్ల కొద్ది నీళ్లు తాగడం, కూరగాయాలు తింటామని చెప్పారు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే శరీరంపై ముడతలే రావని చెప్పారు. తైవాన్ మీడియా.. వారిని ‘The family of frozen ages’ అని కితాబిచ్చింది. వాళ్లు తమ వయస్సు పెరగకుండా ఫ్రీజ్ చేశారని కొనియాడింది. అరవైలోనూ ఇరవైలా కనిపించడమంటే నిజంగా అద్భుతమే కదూ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.