యాప్నగరం

నువ్వుల నూనెతో తెల్ల జుట్టు సమస్యకు చెక్!!

మన పూర్వీకులు నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనదిగా పేర్కొన్నారు. దీనితో చేసిన వంటలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

TNN 12 Dec 2016, 3:57 pm
మన పూర్వీకులు నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనదిగా పేర్కొన్నారు. దీనితో చేసిన వంటలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే నువ్వుల నూనెలో ఉండే పోషక విలువలతో అరోగ్యానికే కాకుండా శిరోజాలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు రాలటాన్ని నివారించడమే కాక చుండ్రును కూడా తగ్గిస్తుంది. కుదళ్లకు పోషణ అందించడం, వాటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ బి, సితోపాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్‌లను కూడా అందజేస్తుంది.
Samayam Telugu amazing benefits of sesame oil for healthy hair
నువ్వుల నూనెతో తెల్ల జుట్టు సమస్యకు చెక్!!


దీనిలో ఉండే ప్రొటీన్లు జుట్టు మొదళ్లను బలంగా చేసి రాలకుండా నివారిస్తాయి. నువ్వుల నూనెలో ఉండే ట్రాక్విలైజింగ్ గుణం వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. సూర్య రశ్మి నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రతతో కుదుళ్లు ప్రమాదానికి గురవుతాయి. ఇందులో అధిక ఉష్ణాన్ని నిరోధించే గుణాల వల్ల తలకు చల్లదనాన్ని ఇస్తుంది. జుట్టుకు అవసరమైన తేమను కూడా అందజేస్తుంది.

తెల్ల జట్టును కూడా నివారిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా నువ్వుల నూనెను తలకు పట్టిస్తే తెల్ల వెంట్రుకలు తగ్గుముఖం పడతాయి.
హానికారక రసాయనాలు ఉండే షాంపూలు, నూనెల వల్ల శిరోజాలు నిర్జీవంగా మారి రాలిపోతాయి. అయితే నువ్వుల నూనె వాడటం వల్ల జట్టు సహజంగా, ఆరోగ్యంగా ఉంటుంది. తలపై ఉండే నరాల్లో రక్త ప్రసరణ పెంచి, ప్రమాదానికి గురైన వెంట్రుకలకు మరమ్మత్తలు చేసి, రాలిపోయిన వాటి స్థానంలో కొత్తవి రావటానికి సహకరిస్తుంది.

చుండ్రు సమస్యలకు కూడా సత్వర ఉపశమనాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై గోరువెచ్చగా చేయాలి. తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని వేళ్ల సహాయంతో తలపై మర్దన చేయాలి. రాత్రి పడుకునే ముంది రాసుకుని, తెల్లవారి గోరువెచ్చని నీటితో కడగాలి. నెల రోజులు పాటు ఇలా చేయడం వల్ల చుండ్రును నివారించవచ్చు.

తలలో పేను సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది. నువ్వుల నూనెలోని రోగ నిరోధక గుణాలు పేను కొరుకుడు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.