యాప్నగరం

గులాబీ నీటితో అందానికి మెరుగులు

రోజ్ వాటర్... అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లోనూ ఉంటుంది.

TNN 29 Dec 2016, 6:58 pm
రోజ్ వాటర్... అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లోనూ ఉంటుంది. ధర కూడా అందుబాటులోనే ఉండడంతో దీని వాడకమూ పెరిగింది. రోజ్ వాటర్ చర్మానికి మంచి ఫ్రెండ్. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దీని తరువాతే ఎవరైనా. ఖరీదైనా టోనర్ లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు ఇలాంటి వాటి అవసరం లేకుండా... వాటి పని కూడా రోజ్ వాటర్ చేసేస్తుంది.
Samayam Telugu beauty benefits of rose water
గులాబీ నీటితో అందానికి మెరుగులు


రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా వడలిపోతుంది. ఇంటికెళ్లాక రోజ్ వాటర్ లో దూదిని ముంచి ముఖమంతా శుభ్రం చేసుకోవాలి. చర్మం పై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కాసేపటికే చర్మం తిరిగి తాజాగా మారుతుంది. ఇది చర్మానికి మంచి టోనర్ అన్నమాట. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది.



ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ట్యాన్ పోతుంది. రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి. తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మొటిమలున్న వారు రోజూ గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.