యాప్నగరం

నెయ్యిని ముఖానికి రాస్తే ఈ సమస్యలన్నీ దూరమై మెరుస్తుందట..

కిచెన్‌లోని చాలా పదార్థాలు అందానికి హెల్ప్ అవుతాయి. ఈ నేపథ్యంలోనే నెయ్యిని వాడితే కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి.

Produced byరావుల అమల | Samayam Telugu 23 Jun 2023, 2:27 pm
స్కిన్ క్యాన్సర్ నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. సరైన సమయానికి పడుకోవడం నుండి ఉదయం, రాత్రి స్కిన్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల ప్రోడక్ట్స్ వాడతారు. అయితే, వీటిలో కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా సాంప్రదాయ పద్ధతుల్లో నెయ్యిని వాడొచ్చు.
Samayam Telugu benefits and ways of applying ghee for skin
నెయ్యిని ముఖానికి రాస్తే ఈ సమస్యలన్నీ దూరమై మెరుస్తుందట..


నెయ్యితో బెనిఫిట్స్..

నెయ్యి.. దీనిని చాలా మంది వంటల్లో వాడతారు. దీనిని వాడడం వల్ల ఇందులోని పోషకాలు ఉన్న నెయ్యిని సూపర్ ఫుడ్ అంటారు. నెయ్యిని ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణకి కూడా వాడొచ్చు. నెయ్యి చర్మానికి అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనిని అప్లై చేస్తే ఏయే బెనిఫిట్స్ వస్తాయో కూడా తెలుసుకుందాం.

మెరిసే స్కిన్‌ కోసం ప్యాక్..

చర్మాన్ని హైడ్రేట్ చేయడం..

నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మానికి దీర్ఘకాలిక హైడ్రేషన్ అందించి పొడిబారకుండా చేస్తుంది. తలస్నానం చేసే ముందు నెయ్యి చర్మానికి రాసుకుంటే స్కిన్ మృదువుగా మారుతుంది.


Also Read : Spotless Skin : మొటిమల మచ్చలు పోవాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

పగిలిన పెదాలకు..

డ్రై, పగిలిన పెదాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనిని తగ్గించుకునేందుకు నెయ్యి బాగా పనిచేస్తుంది. దాని మాయిశ్చరైజింగ్ లక్షణాలతో, నెయ్యి పగిలన పెదాలకి మంచి మాయిశ్చరైజేషన్ అందించి చక్కని రంగుని కూడా అందిస్తాయి.

నెయ్యిలో జీర్ణ వ్యవస్థకి హెల్ప్ చేసే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జీర్ణక్రియ బాగా జరిగితే శరీరంలోని ట్యాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళి చర్మం క్లీన్ అవుతుంది.

కళ్ళ కింద నల్ల వలయాలు..

ఈ సమస్య ఎక్కువగా నిద్ సరిగ్గా పోకపోవడం, ఒతతిడి కారణంగా వస్తుంది. ఇది రావడం వల్ల కళ్ళు చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్యని దూరం చేసేందుకు సమస్య ఉన్న ప్రాంతంలో నెయ్యిని అప్లై చేస్తే కళ్ళు విశ్రాంతి పొంది కాంతివంతంగా మారతాయి. క్రమంగా మచ్చలు కూడా తగ్గుతాయి.
Also Read : చియా సీడ్స్‌ని ఇలా వాడితే ముడతలు తగ్గి యవ్వనంగా మారతారట..

చర్మం యవ్వనంగా..

నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఈ, వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని కాంతివంతంగా ముడతలు, వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి.

​​గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​Read More : Beauty News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.