యాప్నగరం

బీట్‌రూట్‌ మీ లుక్ మార్చేస్తుంది

రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలు పూర్తిగా పోతాయి.

TNN 25 Nov 2016, 6:26 pm
రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలు పూర్తిగా పోతాయి. అలాగే బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా అనుసరించినట్లైతే చర్మరంగులో తప్పకుండా మార్పు వస్తుంది. ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
Samayam Telugu best beauty benefits of beetroot juice for perfect glowing skin
బీట్‌రూట్‌ మీ లుక్ మార్చేస్తుంది


డకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌ను గ్రైండ్‌ చేసి అందులోకి కొన్ని చుక్కల బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. మొదట బీట్‌రూట్‌ ముక్కలను గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులోకి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున గట్టిపెరుగు, ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి పేస్ట్‌గా వాడొచ్చు. తరచూ బీట్‌రూట్‌ రసాన్ని ముఖానికి అప్లై చేస్తుంటే ముఖచర్మం రంగులో కాస్త మార్పు వస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.